Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

14 అంశాలపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్‌

Vijayasai reddy
Vijayasai reddy

మీరు నిర్ధోషులని తేలితే ఎంపి పదవికి రాజీనామా చేస్తా
దళిత నాయుడికి కలిస్తే తప్పేంటి
వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి
అమరావతి: టిటిడిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. దర్యాప్తులో చంద్రబాబు నాయుడు నిర్ధోషిగా తేలితే ఎంపి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. నాలుగు సంవత్సరాల పాలనను ప్రజలు గమనిస్తున్నారని, టిటిడిలో సంఘటనలపై విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. టిటిడి నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చే అర్హత టిటిడికి లేదని, టిటిడి ఏపి ఎండో మెంట్‌ చాప్టర్‌ కిందకు వస్తుందన్నారు. గతంలో నాలుగేళ్లు టిటిడి బోర్డులో సభ్యుడిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. టిటిడి నోటీసులు పంపితే అందులో మీరు సమాచారం ఇవ్వాలని అభ్యర్థించాలే తప్ప నోటీసు అనడానికి వీలు లేదన్నారు. నోటీసులు అందింతే చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. నిప్పు, పప్పు నాయుడులపై సిబిఐ విచారణ జరిపించాలని, బాబు ముద్దాయిగా నిలబడాలని, వారిని ముద్దాయిలుగా పిలవాలని, మమ్మల్ని సాక్ష్యులుగా పిలవాలన్నారు. బాబు తాటకు చప్పుడు బయపడేది లేదన్నారు. 13గంటల సమయం ఇస్తే 240 గంటల తరువాత బాబు స్పందించి టిటిడి నుంచి నోటీసులు అందించారన్నారు. పోలవరం, పట్టిసమీ, భూముల కొనుగోలు, తాత్కాలిక సచివాలయం, అమరావతి, బాబు, లోకేష్‌ విదేశీ పర్యటన, కాల్‌మనీ, సెక్స్‌కారెట్‌, ఓటుకు నోటు, ఐఎంజి స్కాం, అగ్రిగోల్డ్‌, కుటుంబ ఆస్తులు, తిరుమలలో అరాచకాలు, సింగపూర్‌కంపెనీలకు భూముల అప్పగింత, నీరు చెట్టు కార్యక్రమం కింద అవినీతి, భూసేకరణ, భూసమీకరణ తదితర 14 అంశాలన్నింటిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడు విఠలాచార్యలాంటి వారని, పోలవరం సినిమా చూపించడం లాంటిదేనన్నారు. బిజెపితో జత కట్టినంత కాలం ఈవిఎం ట్యాంపరింగ్‌ గుర్తుకురాలేదా?, బిజెపి నుంచి బయటకు రాగానే ఈవిఎం ట్యాంపరింగ్‌ బాబుకు గుర్తుకు వచ్చిందన్నారు. వచ్చే పదినెలలో అధికారంలో దిగిపోతానన్న నిరాశతతో ఈవిఎంలపై బాబు మాట్లాడుతున్నారన్నారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment