Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

‘వనం-మనం’లో 50 కోట్ల మొక్కలు నాటారు

VANAM-MANAM
VANAM-MANAM

నూజివీడు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 50 కోట్ల మొక్కలు నాటాలని సియం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం నూజివీడులో నిర్వహించిన వనం-మనం కార్యక్రమాన్ని సియం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం ఉందని, 2029 నాటికి 50 శాతం పచ్చదనం పెంచుతామని స్పష్టం చేశారు. ఇవాళ ఒక్క రోజే కోటి మొక్కలు నాటామని తెలిపారు. ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటుతామని సియం చంద్రబాబు తెలిపారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటి కళాశాల ఆవరణలో సియం మొక్కలు నాటారు. అనంతరం చెట్లు కాపాడాలంటూ విద్యార్ధులు చేత ప్రతిజ్ఞ చేయించారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment