Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

మొదటి విడతలో 15 వేల గేదెల పంపిణీ

talasani
talasani

హైదరాబాద్‌: మొదటి విడతలో 15 వేల గేదెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని.. పంపిణీ 6 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆగస్టు తొలివారం 2.13 లక్షల మంది రైతులకు గేదెలు, ఆవుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. విజయ, ముల్కనూర్‌, మదర్‌, కరీంనగర్‌ డెయిరీలకు పాలు విక్రయించే రైతులే ఈ పథకానికి లబ్ధి దారులని మంత్రి స్పష్టం చేశారు. పంజాబ్‌, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గేదెలు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారులను తీసుకెళ్లి వారు ఎంపిక చేసిన గేదెలు కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment