Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

మంత్రిలా కాదు పెద్ద మేస్త్రీలా పని చేస్తా!

మంత్రిలా కాదు పెద్ద మేస్త్రీలా పని చేస్తా!

Harish rao
Harish rao

మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులపై హరీష్‌ సమీక్ష
హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తయ్యే వరకు మంత్రిలా కాకుండా పెద్ద మేస్త్రీలా పని చేస్తానని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని, ఆ సమస్య పరిష్కారానికి అన్ని స్థాయిలో కృషి చేద్దామన్నారు. బుధవారం ఆయన జలసౌధలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, బీమా, కోయల్‌ సాగర్‌,తుమ్మిళ్ల,నెట్టంపాడు ప్రాజెక్టు పనులపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రాజెక్టుల ఇంజనీర్లు,కాంట్రాక్టర్లు హాజరయ్యారు.ప్రాజెక్టుల వారీగా,ప్యాకేజీల వారిగా మంత్రి సమీక్ష జరిపారు. బీమా,కోయిల్‌సాగర్‌,తుమ్మిళ్ల ప్రాజెక్టుల్లో భూసేకరణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్య ఉన్న చోట జిల్లా కలెక్ట ర్లు, ఎస్‌డీసీలు,ప్రాజెక్టు ఇంజనీర్లు కలిసి భూసేకరణలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాల న్నారు. ప్రతి రోజు పని తీరును మదింపు చేసుకుని లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.బీమా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఈ సీజన్‌లో బీమా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్యాకేజీ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనన్నారు. బీమా ప్రాజెక్టు పనులకు సంబంధించిన చెల్లింపులు ఎక్కడా ఆగకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయిన వెంటనే చెల్లింపులు జరిగేలా జాగ్రత్త పడుతున్నామన్నారు. ఏజె న్సీలు ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని, తదుపరి లక్ష్యాలను అంచనా వేసుకోవాలన్నారు. కోయిల్‌ సాగర్‌ పనుల పురోగతిని మంత్రి సమీక్ష జరిపారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీ 13,ప్యాకేజీ 14 పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.ప్యాకేజీ 13లో భూసేకరణ జరిగిన చోట కాంట్రాక్టర్లు పనులు చేపట్డడం లేదన్న అంశాన్ని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేగా, వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. మిగిలిన భూసేకరణకు కలెక్టర్లు,ఎస్‌డిసీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి చేయాలన్నారు.
తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి ఆగస్టు 15లోగా ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కార్మికుల సంఖ్యను పెంచాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. పంపులు, మోటార్ల చైనా నుంచి రావాల్సి ఉందని, ఏజెన్సీ ప్రతినిధులు చెప్పగా, వాటిని ఎయిర్‌ కార్గో ద్వారా తెప్పించి సమయాన్ని ఆదా చేయాలని సూచించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన లిప్ట్‌ల సంసిద్దతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సీజన్‌లో లిఫ్ట్‌లు పని చేసేలా సిద్దం చేయాలన్నారు. లిప్ట్స్‌ సలహాదారు పెంటారెడ్డితో మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టు లిప్ట్‌లతో కొత్తగా అప్పాయింట్‌ అయిన ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ ఖగేందర్‌ను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులపై సమీక్ష చేసిన మంత్రి హరీష్‌రావు అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. సున్నా నుంచి 90 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 90 నుంచి 130 కిలోమీటర్ల ప్రదాన కాలువలో నిర్మాణాలు పూర్తి కాకున్నా నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పనులు నిర్వహిస్తోన్న ఏజెన్సీలు పని చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని ఈ నెలాఖరులోగా వస్తానని చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో కార్మికుల కొరతను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు మంత్రి హరీష్‌రావు దృష్టికి తేగా, అప్పటికప్పుడు కాంతనపల్లి ప్రాజెక్టులో నీరు రావడంతో అక్కడ కార్మికులకు పని లేదని తెలుసుకున్న మంత్రి వారిని మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టుల్లో అవసరమైన చోటకు కార్మికులను పంపాలని సీఈని ఆదేశించారు. ఏజెన్సీలు కార్మికుల కొరతపై ఫిర్యాదు చేస్తున్నారని తానే స్వయంగా పెద్ద మెస్త్రీలా వ్యవహరించి ఆయా పనులు తగ్గిన ఏజెన్సీల నుంచి కార్మికులను కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయా ప్యాకేజీ పనుల నిమిత్తం ఛనాకా-కొరాట ప్రాజెక్టు నుంచి ఖమ్మం జిల్లా నుంచి తరలించానని చెప్పారు. ఇదే రీతిలో సీఈలు, ఎస్‌ఈలు, హోదాను దృష్టిలో పెట్టుకోకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment