Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

పవిత్ర మాసానికి స్వాగతం

MASJID1
MASJID

పవిత్ర రమ్‌జాన్‌ మాసానికి స్వాగతం. ఈ కారుణ్యమాసం ఏటేటా వస్తుంది. కారుణ్యరూపాన్ని చూపించి వెళుతుంది. సుగంధ పరిమళాలను గుభాళించి వెళ్లిపోతుంది. నెలంతా దైవనామస్మ రణలతో, దైవస్తోత్రవచనాలతో నలుదిశలా దైవదాసుల అంతరాళాలు భక్తితో పరవశించిపోతాయి. అలసి సొలసిన మానవాళిని ఓదార్చి, సేదతీర్చి నెమ్మదినిస్తుంది. ఈ మాసం మొదటి దశకం కారుణ్యప్రదం, రెండవ దశకం మన్నింపుల నిచ్చేది. మూడవ దశకం నరకాగ్ని నుంచి విముక్తి నిచ్చేది. రమజాను రాకతో స్వర్గద్వారాలు తెరవబ డతాయి. నరక ద్వారాలు మూసివేయబడతాయి. షైతానులు సంకెళ్లతో బంధింపబడతారు. పగలంతా ఉపవాసాలతో రాత్రంతా దైవారాధనలతో జాగారం చేస్తూ దైవసమక్షంలో మోకరించి మొరపెట్టుకునే దాసుల ఆరాధనలు ఆలకరించ బడతాయి. ఆంతర్యాలు మనోకాలుష్యాల నుండి ప్రక్షాళనం గావించబడతాయి. పగలంతా దైవారాధనలతో రాత్రంతా తరావీహ్‌ నమాజులతో, తహజ్జుద్‌ నమాజులతో తాదాత్మ్యం చెందుతాయి. అన్నపానీయాల నుండి శరీరావయవాలను ఆపి ఉంచటం, అధర్మకార్యకలాపాల నుండి ఇంద్రియాలను కాపాడటం, పొరుగువారి స్థితిగతులను తెలుసుకోవటం, బంధుత్వ సంబంధాలను బలపర్చటం, ఆప్తుల బాగోగులను విచారించటం, అభాగ్యులు, అనాధలు నిరుపేదలు, అగత్యపరులను ఆదుకోవటం ఈ ఉత్తమ పనులన్నీ ఈ మాసంలోనే జరుగుతాయి. రమజాన్‌ మాసం మానవాళిపై శుభాలను చిలకరించింది. పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరించిన నెల ఇది. మానవ్ఞ లందరికి ఆ గ్రంధం మార్గదర్శకం. మానవాళికి రుజుమార్గం చూపే, సత్యా సత్యాలను విడమరచి వేరుపరిచే స్పష్టమైన ఆదేశాలు అందులో ఉన్నాయి. ఇకపై రమజాన్‌ మాసాన్ని పొందే వ్యక్తి ఆ నెలంతా ఉపవాసం వ్రతం పాటించాలి. షాబాను మాసం అనంతరం చంద్రదర్శనం మొదలు శుభాల వసంతం ప్రారంభమౌతుంది. షవ్వాలు మాసం చంద్రదర్శనంతో ఉపవాసవ్రతం ముగుస్తుంది. ముస్లిం సమాజం నిష్ఠాగరిష్టమై ఈ నెల మొత్తం దీక్ష కొనసా గిస్తుంది. దైవాదేశాల పాలనకు వ్యక్తిగత శిక్షణ పొందుతుంది. మళ్లీ రానున్న రమజాన్‌ వరకు కర్తవ్యపాలనకు సిద్ధమవ్ఞతుంది. కఠిన ఉపవాసదీక్ష అర్ధం, పరమార్ధమూ ఇదే. దైవం జారీ చేసిన తాకీదులను తూ.చా. తప్పక అనుస రించడమే మనసా, వాచా, కర్మణా రమజాన్‌ స్ఫూర్తిని కొనసాగించడమే. రమ జాన్‌ మాసంలో దైవం తన దాసుల తప్పుల్ని క్షమిస్తాడు. వారి కోరికల్ని తీరు స్తాడు. రమజాన్‌ మొదటి రాత్రి నుండే దైవం తన భక్తుల్ని కారుణ్య దృష్టితో తిలకిస్తాడు. విధేయులైన తన ఈ దాసులు మన్నింపుకోసం రాత్రిం బవళ్లు ప్రార్థిస్తూ ఉంటారని దైవదూతల్ని నియమిస్తాడు.   – షేేఖ్‌ అబ్దుల్‌హఖ్‌

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment