Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

జులై 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ డీలర్లు సమ్మె

DEALERS
DEALERS

సైఫాబాద్‌: రాష్ట్రంలోని 17,270 మంది రేషన్‌ డిలర్లకు వేతనాలు చెల్లించాలని, ఇతర డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జులై 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా సమ్మె నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ప్రకటించింది. తమ సమ్మెకు ఈ మేరకు తమ సమ్మెకు హమాలీలు, కిరోసిన్‌ డిలర్లు, రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించాయని ఆ సంఘం నాయకులు తెలిపారు. బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాప్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, నాయకుడు మల్లేష్‌, ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌, సిఐటియు నాయకులు సుధాకర్‌ తదితరులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రేషన్‌ డీలర్లు ఈ నెల 19వ తేదీన ప్రభుత్వానికి డిడిలు కట్టడం మానుకుని వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలియజేస్దారని, అలాగే 20వ తేదీన జంటనగరాలలోని రేషన్‌ డిలర్లు కూడా జిహెచ్‌ఎంసి కార్యలయం ఎదుట వంటా వార్పు నిర్వహించి నిరసన తెలియజేస్తారని చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతాయని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే జులై 1వ తేదీ నుంచి రాస్ట్ర వ్యాప్తంగా డీలర్ల నిరవధిక సమ్మె తప్పదని వారు హెచ్చరించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, సివిల్‌ సప్లేయి శాఖ మంత్రి, ఇతర మంత్రులు, అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. గతంలో రేషన్‌ డీలర్లు కమిషన్‌ పెంచాలని డిమాండ్‌ చేసేవారని, కాని ఇప్పడు తమకు కమిషన్‌ వద్దు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నామని, ఏలాంటి లాభాలు లేకపోయిన అప్పులు తెచ్చి ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలు అందిస్తున్నామని, కొంత మంది అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాటలకు రేషన్‌ డీలర్లు బెదిరిపోయే ప్రసక్తి లేదని, తాము కూడా తెలంగాణ బిడ్డలమేనని, కెసిఆర్‌ చేసిన తెలంగాణ ఉద్యమ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తే సహించేది లేదని, తీవ్రంగా అడ్గుకుంటామని, తాము కూడా అన్నీంటికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.
25 నుంచి హమాలీల సమ్మె
రాష్ట్ర పౌర సరఫరాల సంస్ధలో హమాలీలుగా పనిచేస్తున్న వారిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25వ తేదీ నుంచి నిరవధికంగా సమ్మె నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయి కార్పోరేషన్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ హెచ్చరించింది. హమాలీలకు నూతన వేతన ఓప్పందం ప్రకారం ఎగుమతి, దిగుమతికి క్వింటాల్‌కు 25 రూపాయలకు పెంచాలని యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిగుళ్ళ శ్రీనివాస్‌, ఎం.ఉత్తమ్‌రావు, ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌, సిఐటియు నాయకుడు సుధాకర్‌ బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. 2012, 2014లలో జరిగిన వేతన ఓప్పందంలో అంగీకరించిన ఇఎస్‌ఐ సౌకర్యాన్ని అమలు చేయాలని, దురదృష్టవ శాత్తు హమాలీ చనిపోతే ఆయన కుటుంబానికి 6 లక్షల రూపాయలు చెల్లించాలని, బోనస్‌ 4 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచాలని, రెండు జతల బట్టలు, టైలరింగ్‌ చార్జీలతోసహా చెల్లించాలని, హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. హమాలీల సమ్మెకు రేషన్‌ డీలర్లు, కిరోసిన్‌ డీలర్లు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌లు మద్దతు ప్రకటించాయి.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment