Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

చంద్రబాబు యూటర్న్‌పై ప్రధాని ఆరా తీశారు!

AP CM BABU1
AP CM BABU

రాష్ట్ర అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుది ఉందని అమిత్‌ షా చెప్పారు!!
బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను అడిగారని బిజెపి ఏపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలతో జరిగిన భేటీ గురించి బుధవారం ఆయన ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన సమయంలో చంద్రబాబే నీళ్లు, మట్టి తెమ్మని ప్రధాని మోడీని అడిగారని వెల్లడించారు. దాంతో ప్రధాని నీరు, మట్టి తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా మోదీ నీళ్లు, మట్టి ఇచ్చారని వస్తున్న విమర్శలపై కన్నా మండిపడ్డారు. రాష్ట్రానికి కావాల్సినవన్నీ తీసుకుంటూనే చంద్రబాబు బిజెపి గురించి రాష్ట్ర ప్రజల మనసులో విష బీజాలు నాటారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుది ఉందని అమిత్‌ షా చెప్పినట్లు కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడంపై మోడీ అడిగారని తెలిపారు. ఆయనకు మనం అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చామని, అడిగినవన్నీ చేశామన్నారు. అయినా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగారని చెప్పారు. అందుకు సమాధానంగా నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటేనని చెప్పానని కన్నా తెలిపారు.
1999ల అనుభవం ఉండి కూడా 2014లో మళ్లీ నమ్మడం మన తప్పేనని చెప్పినట్లు ఆయన వివరించారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలు కూడా చర్చకు వచ్చినట్లు కన్నా వెల్లడించారు. రైల్వే జోన్‌, స్టీల్‌ ప్లాంట్‌, పెట్రోలియం ప్రాజెక్టులు, పోర్టు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. త్వరగా వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు లక్ష్మీనారాయణ వివరించారు.

పదినెలల్లో అది జరగబోతోంది!-జీవిఎల్‌
కన్నాతోపాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న బిజెపి సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జీవిఎల నరసింహారావు మాట్లాడుతూ ఏపి సిఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ప్రాజెక్టులోనూ రాష్ట్ర ప్రయోజనాల కంటే..అక్రమార్జన ఆలోచనలే ఎక్కువగా టిడిపికి ఉన్నాయని ఆరోపించారు. ఇది తెలిసి మరింత బాధ
కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి ఫ్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ది పట్టడం లేదని విమర్శించారు. అలాంటి వారిని ప్రజలు దూరం పెడతారని..పదినెలల్లో అది జరగబోతోందన్నారు. ఇష్టం వచ్చినవాళ్లకి కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ..అడ్డగోలుగా పనిచేస్తుందన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే రీతిలో చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు తాము చేసింది చాఆ ఉందని..టిడిపి ప్రభుత్వం చొరవ తీసుకున్నా..తీసుకోకపోయినా..రాజ్యాంబద్దంగా తమ పరిధిలో పనులు చేసుకుంటూ పోతామన్నారు.

 

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment