Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

చంద్రబాబుకు పాలించే అర్హత లేదు

LAXMI PARVATI
LAXMI PARVATI

వైఎస్సార్సీ పార్టీ నాయకురాలు లక్ష్మిపార్వతి
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ను పాలించే అర్హత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేదని, వైఎస్సార్సీ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మిపార్వతి అన్నారు. బుధవారం వైఎస్సార్సీ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాలుగున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు రైతులతో సహా అందరిని మోసం చేశారని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. సొంత జెండ లేని చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల్లో పేర్కొన్న 600 హామీలలో ఒక్క హామిని కూడా చంద్రబాబు పూర్తిగా నిలబెట్టుకోలేకపోయారని, చంద్రబాబు నిజాయితీ పరుడైతే సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment