Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

గార్బేజి పక్కనే సబ్‌జడ్జి నిరసన

JUDGE
JUDGE

కోచి: కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం మార్కెట్‌ వద్ద కోచి సబ్‌జడ్జి నిర్వహించిననిరసనతో అధికారులు కళ్లుతెరిచారు. సాక్షాత్తూ న్యాయమూర్తి మార్కెట్‌ వ్యర్థాలను తొలగించేందుకు ధర్నాచేయాల్సిన అత్యంత అరుదైన పరిస్థితి రావడం గతంలో ఎక్కడా జరిగిన దాఖలాలేవు. జిల్లా న్యాయసేవల ప్రాధికారసంస్థ కార్యదర్శికూడా అయిన సబ్‌జడ్జి ఎఎం బషీర్‌ మార్కెట్‌లో గార్బేజి పడి ఉన్న ప్రాంతం వద్దనే స్పాట్‌లో నిరసన తెలియజేసారు. అక్కడే కూర్చుని వ్యర్ధాలను తొలగించేంతవరకూ కదలిలేది లేదని భీష్మించుకోవడంతో అధికారులు పరుగులుతీసారు. క్లీన్‌ ఎర్నాకుళం సిటీ ప్రాజెక్టుకింద మార్కెట్‌ను పరిశీలించేందుకు వచ్చిన బషీర్‌కు అక్కడ టన్నులకొద్దీ వ్యర్ధాలు దర్శనమిచ్చాయి. గడచిన కొన్నిరోజులుగా మున్సిపల్‌ అధికారులు ఈ చెత్తను అక్కడినుంచి తొలగించడంలేదని స్థానికులు, మార్కెట్‌ వ్యాపారులుసైతం సబ్‌జడ్జికి తెలిపారు. తనకు ప్రతిరోజూ లెక్కకుమించిన ఫిర్యాదులు వస్తున్నాయని, మార్కెట్‌లో చెత్తను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారని, తనిఖీకి ఇక్కడకు వస్తే మొత్తం స్థానికులు, వ్యాపారులు అందరూ చెత్తను ఇక్కడే వేస్తున్నారని, ఈ అనారోగ్యపరిస్థితులపై వారికి అవగాహనరావడంలేదని బషీర్‌ పేర్కొన్నారు. చెత్తకుసమీపంలోనే కూర్చున్న న్యాయమూర్తి మొత్తం అక్కడినుంచి తొలగించేంతవరకూ అక్కడినుంచి కదిలేది లేదని అల్టిమేటమ్‌ ఇచ్చారు. ట్రక్కులకొద్దీ పేరుకున్న మొత్తంచెత్తను ఆఘమేఘాలమీద మున్సిపల్‌ అధికారులు తొలించారు. ఆ తర్వాతనే ఆయన అక్కడినుంచివెళ్లారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు మార్కెట్‌ యార్డువద్ద పరిశుభ్రత పాటించేందుకువీలుగా వ్యాపారులు, స్థానికులతో కూడినకమిటీని నియమించారు. అలాగే మార్కెట్‌లోని అనేక షాపులకు ఆహారభద్రత విభాగం లైసెన్సులు లేవని గుర్తించారు. అయితే కోచి కార్పొరేషన్‌మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని సమర్ధించుకుంది.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment