Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

ఇంకెన్నాళ్లు ఈ ఘోరాలు?

                                ఇంకెన్నాళ్లు ఈ ఘోరాలు?

COURT
COURT

చట్టాలకు సామాన్యులు లోకువ. సమ ర్థులకు చట్టాలు లోకువ అంటారు. ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో ఇది అక్షరాలా నిజమని పిస్తుంది.ఆర్థిక,అంగ,అధికార, రాజకీయబలం ఉన్న వారు తప్పు చేస్తే చర్యల సంగతి అటుంచి వేలెత్తి చూపడానికి కూడా జంకే దురదృష్టపరిస్థితులు దాపురించాయి. అదే అండా,బలం లేనివారు పొరపాటు చేస్తే చట్టం మాత్రం అన్ని కోణాల్లో తన పని తాను చేసుకుంటుంది. ఏళ్ల తర బడి న్యాయస్థానాల చుట్టూ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరు గుతూనేఉంటారు. చివరకు శిక్షలు కూడా తప్పించుకోలేరు. కానీ చిన్నచిన్న పొరపాట్లే కాదు పెద్ద తప్పులు చేసి పదుల సంఖ్యలో పేదల ప్రాణాలు హరించినప్పుడు కూడా బాధ్యు లైన వారిపై చర్యలు తప్పవ్ఞ. ఎంతటివారినైనా వదిలి పెట్టం. తప్పించుకోలేరు అంటూ హుంకరింపులు ప్రకటన లు ఇస్తున్నారే తప్ప ఆచరణకు వచ్చేసరికి ఏవీ జరగడం లేదు. విచారణలు, కమిటీలు వేసి ప్రజలు మరిచిపోయే వరకు కాలయాపన చేసి ఆ తర్వాత ఆ నివేదికలను అటకె క్కిస్తున్నారు.అందుకే జరిగిన దురదృష్టపు సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. పేదల ప్రాణాలు గాలి లో కలిసిపోతున్నాయి. మళ్లీ సానుభూతులు, ఎక్స్‌గ్రేషి యాలు షరామామూలే. మంగళవారం రాత్రి గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదాన్ని పరిశీలిస్తే ప్రకృతి కంటే మా నవ తప్పిదమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తున్నది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయినా నేటికీ రహదారుల సంగతి దేవ్ఞడెరుగు. మామూలు బాటలు కూడా లేని దుస్థితి.

ప్రతి అవసరానికి లాంచీయే వారికి దిక్కు.ఊరు దాటి ఇతరప్రాంతాలకు వెళ్లాలంటే అదే వారికి ఏకైక శరణ్యం. ఇప్పుడు అదే వారి ప్రాణాలు తీసింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం నలభైనాలుగు మంది ప్రయాణీకులతో బయ లుదేరిన లాంచీ పోలవరం మండలం వాడేపల్లి సమీపంలో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా వీచిన గాలుల కు మునిగిపోయిందని చెప్తున్నారు. తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన మాట వాస్తమే. కానీ ఆ లాంచీలో మోతాదుకు మించి సిమెంటు బస్తాలు వేయడం, ఆ బస్తా లు తడుస్తాయని తలుపులన్నీ మూసివేయడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. అంతేకాదు తలుపు లుమూయడంవల్లనే గాలితో లాంచీ తిరగబడిందనే వాదన కూడా తోసిపుచ్చలేం. ఆరోజే ఆ లాంచీకి ఫిట్‌నెస్‌ సర్టిఫి కేట్‌ ఇచ్చామని చెప్తున్నారు. ఎంత మంది వెళ్లాలి? ఎంత బరువ్ఞ ఉండాలి? వాతావరణంలో వస్తున్న మార్పు లకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి? తదితర జాగ్రత్తలు ఏమీతీసుకోలేదు.అంతేకాదు గాలిఉధృతి పెరగడంతోలాంచీ ని ఒడ్డున నిలిపి తాళ్లతో కట్టిభద్రతా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకుల అభ్యర్థలను కూడా లాంచీ యజమాని కానీ, డ్రైవర్‌తో సహా సిబ్బంది కానీ తీసుకోక పోవడం కూడా ఈ ప్రమాదానికి ముఖ్యకారణంగా చెప్పవచ్చు.ఏదిఏమైనా ఇర వై రెండుమంది అమాయక గిరిజనుల ప్రాణాలు బలితీసు కున్నారు. ఇలా ప్రమాదాలు జరగడం మొదటిది కాదు చివ రిదికూడా కాకపోవచ్చు.

ఇలాంటి సంఘటనలు పునరావృ తం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పాలకు లు ఇప్పుడేకాదు గతంలో కూడా ఎన్నోసార్లు ప్రకటనలు గుప్పించారు. కానీ పాలకుల చేతకానితనాన్ని సమర్థతను, ఆశ్రితపక్షపాతాన్ని చాటుకుంటూ ఏదోఒకరూపంలో ఇలాం టి దురదృష్టపు సంఘటనలు జరుగుతున్నాయి. పెద్దఎత్తు న ప్రాణనష్టం జరిగినప్పుడు జరగాల్సిన సమగ్ర దర్యాప్తు జరగడంలేదు. పైకి కన్పించే కొందరిపై చర్యలు తీసుకోవ డంతో సరిపెడుతున్నారు.అసలు ఈ సంఘటనల వెనుక ఉన్న పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? తది తరవిషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టిపెట్టడం లేదు. విపక్షాలు కూడా పాలకపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రక టనలుచేస్తున్నారే తప్ప వాస్తవాల జోలికివెళ్లడం లేదేమోన నిపిస్తున్నది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి సమీపంలో కృష్ణానదిలో ఫెర్రీఘాట్‌ వద్ద జరిగిన పడవల ప్రమాదానికి కారకులు ఎవరు? కారణాలు ఏమిటి? వెనుక ఉన్న పెద్దల పాత్ర ఏమిటి? తదితర అం శాలన్నీ వెలుగులోకి రాలేదు. అనుమతి లేని బోటు యజ మానిని, ఆ పడవను నడిపేందుకు కనీసడ్రైవింగ్‌ లైసెన్సు లేని డ్రైవర్‌తో సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు అప్పట్లో పోలీసు కమిషనర్‌ ప్రకటించారు. వారేకారకులని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇరవై ఒక్కమంది ని పొట్టన పెట్టుకున్న ఈ ఘోర దుర్ఘటనకు ఆ ఏడుగురిదే బాధ్యతా? ఇంకెవరికి ఇందులో పాత్ర లేదా?తదితర ప్రశ్న లకు నేటికీ జవాబులేదు.అదేకాదు 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి ఘాట్‌లో జరిగిన దుర దృష్టపుకర సంఘటనలకు సంబం ధించి ఇప్పటివరకు ఎవరిపైచర్యలు తీసుకున్నారు? బాధ్యు లెవరు?ఆ సంఘ టన ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? తదితర ప్రశ్న లకు కూడా ఇప్పటికీ జవాబు లేదు. దీనిపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించేందుకు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సి.వై సోమయాజులతో నియమించి న ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఇప్పటికీ ఎందుకు వెలుగు చూడలేదు? ఎంతో పుణ్యప్రదమని కోట్లాది మంది ప్రజలు భావించి గోదావరితల్లి ఆశీస్సులు అందుకుందామని గంపెడు ఆశతో, ఆతృతతో వచ్చినవారికి ఎంతటి చేదు అనుభవాలు మిగిలాయో ఇప్పటికీ వారు మరిచిపో లేకపోతున్నారు. ఏకంగా ముప్ఫైఒక్క మందిని పొట్టన పెట్టుకున్నారు. ఏద ేమైనాఅవినీతి,అసమర్థత,అహంకారం, అనుభవారాహి త్యం,మూర్తీభవించిన కొందరు రాజకీయనాయకులకు పెద్ద పీట వేస్తే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. అమాయకులు బలి అవ్ఞతూనే ఉంటారు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment