Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

అన్నపూర్ణ ఆంధ్రను మద్యాంధ్రగా మార్చిన ప్రభుత్వం

Andhra Pradesh
Andhra Pradesh

మద్యంపై అన్ని పార్టీలు యుద్దం ప్రకటించాలి
మద్య వ్యతిరేక సదస్సులో వక్తలు
హైదరాబాద్‌: అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని మద్య వ్యతిరేక సదస్సు ఆరోపించింది. అన్ని రాజకీయ పార్టీలు మద్యంపై యుద్దం ప్రకటించాలని పిలుపునిచ్చింది. విజయవాడలోని కార్యాలయంలో బుధవారం మద్య వ్యతిరేక ఉద్యమ రాష్ట్ర సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ మద్యంపై ఎక్సైజ్‌ ఆదాయం 100 శాతం పెరిగిందన్నారు. గత నాలుగేళ్లుగా మద్యం దుష్ఫలితాలను ప్రజలకు వివరించేందుకు ఒక్క రూపాయిని కూడా ఖర్చు చేయలేదని అభ్యతరం వ్యక్తం చేశారు. గుజరాత్‌ రాష్ట్రం మద్యంపై ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. బీహార్‌, గుజరాత్‌, మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉందని వెల్లడించారు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని వైఎస్సార్‌ సీపీ ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. నేడు రాష్ట్రంలోని ప్రతీ ఇల్లూ బెల్ట్‌ షాపుగా మారిందని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడం తక్షణ కర్తవ్యమని వ్యాఖ్కానించారు. మద్యం సుష్ప్రభావాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మద్యం వ్యాపారం చేసేవారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వబోమని రాజకీయ పార్టీలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మద్యపాన సమస్యను రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య కోణలో చూడాలని కోరారు. ఎన్టీరామారావు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే చంద్రబాబు దాన్ని ఎత్తివేసి బెల్ట్‌షాపులకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని, పిఓడబ్యు రాష్ట్ర అధ్యక్షరాలు రాగి గంగాభవాని, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేత డాక్టర్‌ సేవకుమార్‌, లోక్‌సత్తా నేత డి మనోరమ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment