Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

అదో ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్‌

అదో ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్‌

SUICIDE
SUICIDE

పనిచేసే ఉద్యోగే ఆత్యహత్యకు పాల్పడితే..!
వాషింగ్టన్‌: పిన్న వయసు యువతులే పైగా వారంతా ఆత్మహత్యల నివారణకు కృషిచేసే హెల్ప్‌లైన్‌ సంస్థలో పనిచేస్తున్నారు. టీనేజి వలంటీర్లుగా విస్తృతసేవలందించే వీరిలో కూడా మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యల నివారణకు టోరి,బెతోవెన్‌అనే ఇద్దరుప్రారంభించిన హాట్‌లైన్‌కు నిరంతరం వచ్చే ఫోన్లను విశ్లేషిస్తే వారికి ఎన్నో ఆసక్తికర అంశాలు బోధపడ్డాయి. ఎక్కువశాతం మానసిక దౌర్భల్యం వల్లనే వారు చనిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే ఆత్మహత్యల నివారణకు ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌సంస్థ ఉద్యోగిటోరియే ఆత్మహత్యకు పాల్పడినవైనం మరింతగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని వ్యాధినివారణ,నిర్మూలనకేంద్రం గణాంకాలనుచూస్తే పురుషుల్లో 15నుంచి 19 ఏళ్లలోపు ఆత్మహత్యలు 31శాతంకి పెరిగాయి. 2007 నుంచి2015 వరకూ ఈ ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయి. లక్ష మంది మహిళల్లో 14.2శాతం ఆత్మహత్యలుచేసుకుంటున్నారు. 2007 నుంచి 2015సంవత్సరాలమధ్య చూస్తే 2.4 నుంచి 5.1శాతానికిచేరాయి. మరణాల్లో ఎక్కువగా ఆత్మహత్యలే సంఖ్యాపరంగా గరిష్టంగా ఉన్నాయి. ప్రతిమూడు ఆత్మహత్యల్లో రెండు తుపాకులు వంటి మారణాయుధాలతోనే చేసుకుంటున్నారు.ఆత్మహత్యలకు ఎందుకు గురవుతున్నారు? ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌కు వారు ఓర్పుతో ఇచ్చే సమాధానాలుచివరకు హెల్ప్‌డెస్క్‌ యువతే స్వయంగా ఆత్మహత్యకు పాల్పడిందంటే ఇందుకు ఎదురవుతున్న సామాజిక రుగ్మతలేనని కొందరు, శారీరక మానసిక దౌర్భల్యంగా మరికొందరు చెప్పుకుంటున్నారు. హటాత్తుగా ఒకరోజు తన సహచరి ఆత్మత్యకు పాల్పడిందని తనప్రోగ్రామ్‌ హెడ్‌ స్వయంగా చెప్పడంతో బెథోవెన్‌కు కాళ్లుచేతులు వణికాయి. కారణాలేమిటి అన్నది శోధించినా కనిపించలేదు. మూడు గంటలపాటు తన నవ నాడులు పనిచేయలేదు. సోషల్‌మీడియా లేదా ఇంటర్నెట్‌ ముందు వీక్షించేవిధంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చనిపోడానికి కారణాలు అన్వేషిస్తే ఇసుమంతయినా లభించలేదు. చివరకు ఏకాంతంగా ఆలోచిస్తే ఇలాంటి మానసిక దౌర్భల్యం వల్లనే చనిపోతున్నట్లు తేలింది. విద్యావ్యవస్థకూడా ఇందుకు దోహదంచేస్తోంది. ఉపాధ్యాయులు, తల్లితండ్రులు పిల్లల సామర్ధ్యాన్ని అంచనాలకు మించి ఊహించడం కూడా ఇందుకు ఎక్కువయింది.పిల్లల సామర్ధ్యంపై ఆందోళనగా ఉన్నట్లు వారికి కనిపించకూడదు.అదికూడా ఒక కారణమే అవుతుంది. ఆత్మహత్యచేసుకోవాలన్న ఆలోచనే రాకుండా ఉండాలి. అందుకు మానసికంగా పరిపక్వత కావాలని, ఆదిశగానే మరింత కృషిజరిగితే తప్ప ఆత్మహత్యలకు అంతం ఉండదన్నది టోరి ఆత్మహత్యోదంతం స్పష్టంచేస్తోంది. వాషింగ్టన్‌పోస్టుకు ప్రత్యేక కథనంగా రాసిన ఈ వ్యాసం కొంతమంది యువతీయువకులకైనా గుణపాఠం తెస్తే అదే పదివేలని భావించవచ్చు. దేశవ్యాప్తంగానేకాదు, అంతర్జాతీయంగా కూడా పెరిగిపోతున్నాయి. మానసిక పరిపక్వత లేకపోవడమే ఇందుకు దారితీస్తోందన్న శాస్త్రవేత్తల విశ్లేషణలో వాస్తవాలు లేకపోలేదు. సామరిటన్స్‌పేరిటనిర్వహిస్తున్న ఈ హెల్ప్‌లైన్‌డెస్క్‌లో పనిచేసే యువతే ఆత్మహత్యకు పాల్పడితే ఇలాంటిదుష్పరిణామాలు సమాజాన్ని ఇంకెంత కుదిపేస్తున్నాయోనన్న ఆందోళన ఆయా తల్లితండ్రులకు ఆ కుటుంబాల్లో ఆరని చిచ్చుగాకొనసాగుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు.

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment