Digg StumbleUpon LinkedIn YouTube Flickr Facebook Twitter RSS Reset

అడవులను కాపాడుకుందాం

ప్రజావాక్కు

                              అడవులను కాపాడుకుందాం

Forest
Forest

అడవులను కాపాడుకుందాం
ప్రస్తుత సీజన్‌లో రాత్రిళ్లు ప్రయాణం చేసే సమయంలో కొం డలు, గుట్టలు, తగులబడటం సర్వసాధారణంగా కన్పిస్తున్నా యి. మన రాష్ట్రంలోఉన్న అడవ్ఞలు వేసవి కాలంలో అగ్నికి ఆహుతి అవ్ఞతున్నాయి. దీనికి ప్రకృతి సిద్ధమైన కారణాలతో పాటు నిర్లక్ష్యంగా, స్వార్థంతో వ్యవహరించే మనుషులు కూడా కారణం కావడం విచారకరం. అటవీ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ధూమపాన ప్రియులు సిగరెట్లు, బీడీల ను ఆర్పకుండా సరదాగా విసిరేయడంవల్ల అడవ్ఞల్లో, గుట్టల పై మంటలు లేస్తున్నాయి.మంటల బారినపడి కొండలపై వృక్ష సంపదకు విపరీత నష్టం వాటిల్లుతోంది. ఇలా అటవీ సంపద హరించుకుపోతే మానవ మనుగడకు ఎదురయ్యే ముప్పు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అటవీ శాఖాధికారులు పటిష్టమైన చర్యలు తీసుకొని అడవ్ఞలను కాపాడాలి.
-జి. అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

మృత్యునిలయాలుగా సాగర తీరాలు
విశాఖలో పర్యాటక రంగానికి తలమానికంగా నిలుస్తూ ఆహ్లా దం కలిగించే పలుసాగరతీరాలు మృత్యు నిలయాలుగా మారు తున్నాయి. కొంతసేపు సముద్రంలో జలకాలద్వారా సేద తీరు దామని వెళ్లే సందర్శకులు అక్కడి రాక్షస అలలకు బలైపో తున్నారు. గత అయిదేళ్ల కాలంలో దాదాపుగా నాలుగు వం దలమంది విగత జీవ్ఞలుగా మారినా, ప్రమాదం జరిగేటప్పు డు అధికారులు చేసే హడావ్ఞడి తప్ప పూర్తిస్థాయిలో నియం త్రణా చర్యలు శూన్యం. తగినన్ని కమ్యూనిటీ గార్డులను, లైఫ్‌ గార్డులను ఎల్లవేళ్లలా పర్యవేక్షణా నిమిత్తం నియమించడం, హెచ్చరికల బోర్డులు పెంచడం, ప్రమాదం జోన్లను ఏర్పాటు చేసి నిబంధనలను అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించడం సాగరతీరం పొడవ్ఞనా సిసికెమెరాలతోపాటు తగినన్ని కంట్రో ల్‌ రూమ్‌లు ఏర్పాటు వంటి చర్యలు తక్షణం చేపట్టాలి..
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పెరుగుతున్న శబ్దకాలుష్యం
రెండు తెలుగు రాష్ట్రాల్లో శబ్దకాలుష్యం పరిమితులకు మించి నమోదు అవ్ఞతున్నదన్న జాతీయ పర్యావరణ సంస్థ అధ్య యన నివేదిక పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి. రోడ్లపై ముఖ్యంగా జాతీయ రహదారులలో ప్రయాణించే వాహనాలు అవసరం లేకపోయినాహారన్‌లు ఉపయోగిస్తూ ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారు. పరిమితికి మించిన ధ్వని కాలుష్యం వలన ప్రజలకు వినికిడి సమస్యలు తలెత్తే ప్రమాదం ఎంతైనా ఉంది.
-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

భారతీయులంటే అంత అలుసా!
ఇరాక్‌లో 32 మంది భారతీయులు నాలుగేళ్ల క్రితం అపహ రణకు గురయ్యారు. వారి విడుదలకు ఒత్తిడి తెచ్చేందుకు మన కేంద్రప్రభుత్వం ఎలాంటిచర్యలు చేపట్టలేదు. పైగా వారందరూ క్షేమంగా ఉన్నారని దేశ ప్రజలను ఇంతకాలంగా మభ్యపెడుతూ ఒక్కసారిగా వారందరూ ఊచకోతకు గురయ్యారని పార్లమెంట్‌ లో ప్రకటించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరు కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణను పార్లమెంటు వేదికగా రూపొందించుకొని వ్ఞంటే ఎంతో బాగుండేది.
-ఎం.కనకదుర్గ, తెనాలి,గుంటూరుజిల్లా

అవినీతి అంతం కావాలంటే..
జీతం వేలల్లో, లంచాలు లక్షల్లో తీసుకునే ఉద్యోగులుంటున్నా మన రాష్ట్రంలో అవినీతి ఏనాటికీ అంతం కాదు. కారణం అవి నీతిపరులకు కఠినమైన శిక్షలు విధించడం లేదు. ఒకరిద్దరిని వాళ్లుచేసిన నేర తీవ్రతను బట్టి సస్పెండ్‌ చేయకుండా ఉద్యోగం నుంచి ఊడదీసి ఇంటికి పంపితే చాలు. మిగతా ఉద్యోగుల గుండెల్లో దడపుడుతుంది.స్వచ్ఛమైన పరిపాలనకు ప్రభుత్వా నికి సంబంధించిన అన్నిశాఖల్లోని ఉద్యోగులందరూ చిత్తశుద్ధి తో, నిజాయితీగా తమ తమ విధులు నిర్వహించాలి.

-కాలిపు కుర్మావతారం,శతాబ్దినగర్‌, విశాఖపట్నం

అధ్వాన్నంగా మారిన రహదారులు
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని అంతర్గత రహదారులు గోతులమయమై అధ్వాన్నంగా మారాయి. ప్రతి యేటా వివిధ పన్నుల ద్వారా ప్రజల నుండి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా రోడ్లపరిస్థితులలో మార్పు లేదు. ప్రతి వీధిలో ఉన్న సిసి రోడ్లు రాళ్లు, కంకర, మట్టితో పైకి లేచి అధ్వాన్నంగా మారాయి. పాలక వర్గం స్పందించి వెంటనే ప్రతి వీధిలో సిసి రోడ్లను వేయించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, పరకాల వరంగల్‌జిల్లా

ఐ.పి.ఎల్‌ల ఉద్దేశ్యం ఏమిటి?
ప్రతి ఏటా ఐ.పి.ఎల్‌ పేరిట జట్లను చేసి వేసవిలో విరామం లేకుండా ఆటగాళ్లను టి-20 క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిని ఏ ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్నారు? దీనివల్ల లాభమేమిటి? విదేశీ ఆటగాళ్లతో కలిసి స్వదేశంలో స్వదేశీయులకే ఒకరికొకరిని ప్రత్యర్థులుగా చేసి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. భారతీయ ఆటగాళ్లమధ్యనే కాదు ఐ.పి.ఎల్‌ల పుణ్యమా అని ఇంట్లో సభ్యుల మధ్యనే ఐక్యత దెబ్బతిని కీచులాటకు దారితీస్తుంది.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్‌

Related Images:

[See image gallery at www.vaartha.com]

No comments yet.

Leave a Comment